కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ లో భాగంగా మోహన్ బగాన్ జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుం ది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో మోహన్ బగాన్ 2-0తో ఈస్ట్ బెం గాల్‌పై విజయం సాధించింది. జేమీ మెక్‌లారెన్ (ఆట 41వ నిమిషం), పెట్రాటోస్ (81వ నిమిషం)లో మో హన్ బగాన్‌కు గోల్స్ అందించారు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన మోహన్ బగాన్ పాయిం ట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.