హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో మోహిత్ సైనీ ముందంజ వేశాడు. హుస్సేన్ సాగర్‌లో జరుగుతున్న 38వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ తొలి రోజు పోటీల్లో మోహిత్ రెండు రౌండ్లలో ఆధిక్యంలో నిలిచాడు. ఐఎల్‌సీఏ 7 కేటగిరీలో అలలపై అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ముందుకు సాగిన మోహిత్ అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఐఎల్‌సీఏ 6 మహిళల కేటగిరీలో రితిక, ఓపెన్ విభాగంలో రామ్ మిలాన్ ముందంజ వేశారు. 470 క్లాస్‌లో శారద శర్మ జంట విజేతగా నిలిచింది.