calender_icon.png 18 April, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి ఎంపిక

27-03-2025 11:27:10 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ జూనియర్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ గురువారం న్యాయవాదుల సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో న్యాయవాది ర్యాల మొహన్ రెడ్డిని అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... న్యాయవాదుల సమస్యలు పరిష్కారానికి సభ్యులతో కలిసి పనిచేస్తానని, తనమీద నమ్మకంతో తనని అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పినందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా మొగులయ్య, కార్యదర్శిగా ఖలీల్, అమీద్, అజీమ్ లను ఎన్నుకున్నారు.