* పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాం తి): దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని కించపర్చేలా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు సరికావని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు పేర్కొన్నారు. అయోధ్యలో రాముడి గుడిని కట్టినప్పు డే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని, 1947లో దేశానికి స్వాతంత్య్రం రాలేదని మోహగన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను తాను వ్యతిరేకిస్తున్నానన్నారు.
సోమవారం ఆయన అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో మోహన్‌భగవత్‌పై సోమవారం కేసుపెట్టారు. అనంతరం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సమాజాన్ని, యువతను తప్పుదోవ పట్టించేలా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వ్యాఖ్యలున్నాయని మండిపడ్డారు. గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా అంబేద్కర్‌ను అవమానపర్చేలా మాట్లాడారని గుర్తుచేశారు.