calender_icon.png 4 February, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగారెడ్డి కలెక్టరేట్‌కు మోహన్‌బాబు, మనోజ్

04-02-2025 01:21:08 AM

*  విచారించిన అదనపు కలెక్టర్

* వేర్వురుగా వివరాలు అందజేత 

మహేశ్వరం, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): కుమారుడు మంచు మనో  తనకు ఆస్తి వివాదాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలని సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు గతంలోరం  కలెక్టర్ నారాయణరెడ్డికి లేఖ రాశారు. బాలాపూర్ మండలంలోని జల్‌పల్లి ఫాంహౌస్ తన స్వార్జితమని, అక్కడ మనోజ్ అక్రమంగా ఉంటున్నాడని, తన ఆస్తులను తనకు అప్పగించాలని లేఖలో కోరారు.

లేఖపై స్పందించిన కలెక్టర్ ఇటీవల మనోజ్‌కు నోటీసులు జారీ చే  దీనిలో భాగం  తండ్రీకొడుకులు సోమవారం రంగారెడ్డి కలెక్ట  విచారణకు హాజరయ్యారు. అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ వారిద్దరినీ రెండు గం  విచారించారు. ఇద్దరూ వచ్చేవారం మరోసా  విచారణకు హజరు కావాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. విచారణ తర్వాత బయటకు వచ్చిన మో  మనోజ్ మీడియాతో మాట్లాడకుండా, ఎలాంటి వివరాలు వెల్లడిం  అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయారు. మోహన్‌బాబు, మనోజ్ వేర్వేరుగా అనేక అంశాలపై అదనపు కలెక్టర్‌కు నివేదిక అందించినట్లు తెలిసింది.