calender_icon.png 24 December, 2024 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోహన్‌బాబుకు చుక్కెదురు

24-12-2024 01:57:13 AM

  1. జర్నలిస్టుపై దాడి కేసులో..
  2. ముందస్తు బెయిల్‌కు హైకోర్టు నిరాకరణ

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిలు మంజూరుకు పిటిషన్ వేసిన సినీ నటుడు మోహన్‌బాబుకు హైకో ర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయి ల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. పోలీసులు నమోదు చేసిన కేసులో అ భియోగాలు తీవ్రమైనవి కావడంతో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది.

మోహన్‌బాబు పిటిషన్ ను కొట్టివేస్తూ జస్టిస్ కె లక్ష్మణ్ సోమవారం తీర్పు చెప్పారు. మోహన్ బాబు తరఫు సీనియర్ లాయర్ ఎల్ రవిచందర్ వాదిస్తూ, కింది కోర్టులో రెగ్యులర్ బెయిలు పిటిషన్ దాఖలు చేసుకుంటామని, దాఖలు చేసిన రోజునే దానిపై విచారణ పూర్తిచేసి ఉత్తర్వులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాల ని కోరారు.

ఈ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్ వేసిన రోజునే విచారణ చేపట్టి నిర్ణయం వెలువరించాలని సుప్రీం కోర్టు తీర్పు ఏదైనా ఉందా, ఏమైనా చట్టం ఉందా అని ప్రశ్నించింది. ఒకే రోజు పిటిషన్ విచారణ చేపట్టాలని ఉత్తర్వులు ఎలా ఇవ్వాలని నిలదీసింది. అలాంటి ఒత్తిడి కింది కోర్టుపై పెడుతూ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తరువాత ప్రాసిక్యూషన్ కౌంటరు దాఖలు చేయాలని, ఆపై వాదనలు వినాలని, ఇవన్నీ ఒక్కరోజులోనే ఎలా సాధ్యమని ప్రశ్నించింది. సాధారణ పద్ధతిలో బెయిలు పిటిషన్ దాఖలు చేసుకుని చట్ట ప్రకారం తగిన ఉత్తర్వులు పొందాలని తేల్చిచెప్పింది.

మోహన్ బాబు దుబాయి పారిపోయారనే అభియోగాల నేపథ్యంలో ఆయన న్యాయవాది కల్పించుకుని, మోహన్‌బాబు తన మనుమడిని చూడానికి దుబాయ్ వెళ్లివచ్చారని, ప్రస్తుతం తిరుపతిలో తన విద్యాసంస్థల నిర్వహణలో ఉన్నారని చెప్పారు.

మోహన్‌బాబు చేసిన దాడి సంఘటనలో విలేకరికి తీవ్రగాయమైందని, మెడికల్ రికార్డును పరిశీలించిన తరువాత ఫిర్యాదుదారు నుంచి మరోసా రి వాంగ్మూలం తీసుకుని హత్యాయ త్నం కేసు నమోదు చేశామన్న అదనపు పీపీ జితేందర్ రావు వీరమల్ల వాదించారు.

ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. కేసు తీవ్రత నేపథ్యంలో, ఈ దశలో ముందస్తు బెయిలు మంజూరు చేయలేమన్నారు. పిటిషన్‌ను కొట్టేవేస్తున్నట్లు ప్రకటించారు. చట్ట ప్రకారం దర్యాప్తును కొనసాగించవచ్చునని పోలీసులకు ఆదేశించారు.