జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి...
దాడిని ఖండించిన ఉప్పల్,మేడిపల్లి జర్నలిస్టు సంఘాలు..
ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద జర్నలిస్టులు నిరసన....
మేడిపల్లి (విజయక్రాంతి): జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడం హేయమైన చర్యయని జర్నలిస్టు సంఘాలు అన్నారు.టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా బుధవారం ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు...ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ.. సినీ నటుడు మోహన్ బాబు ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కుటుంబ కలహాలు మీడియా ముందుకు రాకూడదని, మీడియా ప్రతినిధులు తమ వృత్తిపరమైన విధులు తాము చేస్తున్న నేపథ్యంలో వారిపై శారీరకంగా దాడులు చేయటం ఎంతమాత్రం ఆమోద్యయోగ్యం కాదన్నారు. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న జర్నలిస్టు రంజిత్ బహిరంగ క్షమాపణ చెప్పి వైద్య ఖర్చులు మోహన్ బాబు భరించాలన్నారు.
ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేవారు ఎలాంటి వారైనా ప్రజాకోర్టులో నిలబడాల్సిందేనని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడి పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో జర్నలిస్టులు శ్రీనివాస్ (సాక్షి), చంద్రమౌళి (మన తెలంగాణ), శ్రవణ్ యాదవ్ (దిశ), మరాటి మల్లేష్ (విజన్ ఆంధ్ర), స్టాలిన్ (టీవీ9), నరేందర్ (10టీవీ), సతీష్ (రాజ్ న్యూస్), నాగరాజు (ప్రైమ్9), లక్ష్మణ్ (సీవీఅర్), చంద్రశేఖర్ (వి5), రాజు (ఇండియా నౌ), నందీష్ (ఉదయ అక్షరం), నారగోని ప్రవీణ్ (తెలంగాణ రియల్ లీడర్స్ అసోసియేషన్) తదితరులు పాల్గొన్నారు.