calender_icon.png 22 October, 2024 | 11:19 PM

మహ్మద్ హుస్సేన్ అరెస్ట్ అప్రజాస్వామికం

11-07-2024 12:23:23 AM

మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్

ములుగు (జయశంకర్ భూపాలపల్లి), జూలై 10 (విజయక్రాంతి)/హుజూరాబాద్ : పదేళ్ల క్రితం జైలు నుంచి విడుదలై సాధార ణ జీవితం గడుపుతున్న మహ్మద్ హుస్సేన్ ను అక్రమంగా అరెస్టు చేసి కట్టుకథ అల్లుతున్నారని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో ఆరోపించారు. బుధవారం మీడియా కు మావోయిస్టు పార్టీ పేరుతో ఒక లేఖను విడుదల చేశారు. సింగరేణి ఏరియాలో సికా స పునర్నిర్మాణం కోసం మావోయిస్టు భావాజాలాన్ని తీసుకెళ్తున్నాడని ముఖ్యమం త్రి ఆదేశాల మేరకు మంచిర్యాల పోలీసులు జమ్మికుంటలో కిడ్నాప్ చేసి, మంచిర్యాలలో అరెస్ట్ చేసినట్టు చూపుతున్నారని పేర్కొన్నారు. అబద్ధాలతో కట్టుకథలు అల్లడం కేవలం ఫాసిస్టు పాలకులకు మాత్రమే సాధ్యమవుతుందని మండిపడ్డారు.  సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయని ఆరోపించారు. ఈ క్రమంలో నే కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారన్నారు. ఉద్యమాలను అణిచివే సేందుకు నాయకత్వం వహించే వారిపై మావోయిస్టు ముద్ర వేసి అరెస్టుకు పూనుకుంటున్నారని ఆరోపించారు.