బంగ్లాదేశ్ సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్‌తో జరగనున్న మూడో టీ20 తనకు ఆఖరిది కానుందని మహ్మదుల్లా వెల్లడించాడు.‘జట్టు కోచ్‌తో, సెలెక్టర్లు, కెప్టెన్‌తో మాట్లాడే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇక వన్డేల మీదే దృష్టిని కేంద్రీకరిస్తా. మరింత మెరుగ్గా ఆడేందుకు కృషి చేస్తా’ అని మహ్మదుల్లా వెల్లడించాడు. బంగ్లాదేశ్ తరఫున 43 టీ20 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన మహ్మదుల్లా 16 మ్యాచ్‌ల్లో బంగ్లాను గెలిపించాడు. 2007లో టీ20ల్లో ఆరంగ్రేటం చేసిన మహ్మదుల్లా ఇప్పటి వరకు 139 మ్యాచ్‌ల్లో 2394 పరుగులతో పాటు బౌలింగ్‌లో 40 వికెట్లు తీశాడు.