03-04-2025 01:14:58 AM
కేంద్ర సహాయంతోనే సన్న బియ్యం పంపిణీ
- జిల్లా కలెక్టర్‌కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి వినతి
ఖమ్మం, ఏప్రిల్ 2 (విజయక్రాంతి) : -రాష్ట్రంలోని రేషన్ షాపుల వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోటోతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ను కోరారు.
కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించేందుకు ఈ చర్య తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమంలో ప్రధాన భాగస్వామ్యం కేంద్రానిదేనని కోటేశ్వరరావు తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా తన పేరుతో ప్రచారం చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. “ప్రతి రేషన్ షాప్ వద్ద మోడీ ఫోటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, కేంద్రం అందిస్తున్న సహాయాన్ని ప్రజలకు తెలియ జేయాలన్నారు.