calender_icon.png 5 January, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్ బైడన్‌కు మోదీ అత్యంత ఖరీదైన గిఫ్ట్

04-01-2025 01:05:10 AM

2023లో అందుకున్న బహుమతుల్లో ఇదే కాస్ట్లీ

వాషింగ్టన్, జనవరి 3: అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సతీమణి జిల్ బైడన్‌కు 2023లో అత్యంత ఖరీదైన బహుమతి అందింది. ఆ గిఫ్ట్ ఇచ్చింది భారత ప్రధాని మోదీ కావడం విశేషం. మోదీ రూ.17.15 లక్షలు (20,000 డాలర్లు) వెచ్చించి మరీ కళాకారులతో 7.5 క్యారెట్ల డైమండ్‌ను తయారు చేయించారు.

ఆ డైమండ్ ప్రకృతి సిద్ధంగా లభించింది కావడం మరో విశేషం. 2023లో బైడన్ దంపతులకు అందిన అత్యంత ఖరీదైన బహుమతుల్లో వజ్రం టాప్ వన్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఉక్రెయిన్ రాయబారి ఇచ్చిన 14,063 డాలర్ల విలువైన బ్రాస్‌లెట్, తర్వాత ఈజిప్ట్ ప్రతినిధులు అందించిన 4,510 ఫొటో అల్బమ్ నిలిచింది.

మోదీ అందించిన ఆభరణం ప్రస్తుతం వైట్‌హౌజ్‌లోని ఈస్ట్‌వింగ్‌లో ప్రదర్శనకు ఉంది. అయితే.. విదేశీ అతిథులు అందించిన బహుమతులు 480 డాలర్ల కంటే తక్కువ విలువ ఉంటే అధ్యక్షుడు లేదా ఆయన సతీమణికే చెందుతాయి.

బహుమతి విలువ 480 డాలర్ల కంటే ఎక్కువగా ఉంటే, ఆ బహుమతిని కేవలం వైట్‌హౌజ్ పరిధిలోనే ఉంచాల్సి ఉంటుంది. అధ్యక్ష పదవిలో ఉన్నంత కాలం దంపతులు వైట్‌హౌజ్‌లో బహుమతులు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.