calender_icon.png 6 March, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనిచేసిన మోడీ ఛరిష్మా!

06-03-2025 01:10:35 AM

కరీంనగర్, మార్చి 5 (విజయక్రాంతి): కరీంనగర్-మెదక్ -నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో ఎవరి ఊహలకు అందకుండా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో ఉత్తర తెలంగాణలో బీజేపీ మరింత పట్టు పెంచుకున్న ట్లయింది.

ముఖ్యంగా తొలిసారి ఓటర్లుగా నమోదు చేసుకున్న పట్టభద్రులు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ మానియా పనిచేసిందని చెప్పవచ్చు. ఈ ఎన్నికల సమయంలో కుంభమేళా జరగడం, కుంభమేళాలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, పుణ్య స్నానాలు సెంటిమెంట్ ను మరింత పెంచినట్లయింది. పార్లమెంట్ ఎన్నికల సమయం లో అయోధ్య రామమందిరం ఎలా అయితే పనిచేసిందో పట్టభద్రుల ఎన్నికల్లో కుంభమేళా ఎఫెక్ట్ కూడా పనిచేసిందని చెప్పవ చ్చు.

దీనికితోడు మోడీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన  ఆదా య పన్ను పరిమితి 12 లక్షల వరకు పెంచడంతో ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఐటీ ఉద్యోగులకు కలిసి వచ్చిందని చెప్పవచ్చు. నిజానికి అంజిరెడ్డి ఓటర్లను ట చేయకున్నా ఆయన గెలుపొందడం విశేషం. మోడీ ప్రభావంతోపాటు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు విస్తృతంగా పర్యటించడం అంజిరెడ్డికి కలిసి వచ్చిన అంశంగా చెప్పవచ్చు.

 కన్నీటి పర్యంతమైన నరేందర్ రెడ్డి

బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తుండగానే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి బయటకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. కష్టపడి ప్రతి ఓటరును కలిసినా తాను గెలుపు దగ్గరలోకి వచ్చి ఓటమి పాలు కావడంతో కన్నీటిపర్యంతమయ్యారు. నరేందర్ రెడ్డితోపాటు కౌంటింగ్ హాలు నుంచి ఆయన ఏజెంట్లు, కాంగ్రెస్ నాయకులు బయటకు వెళ్లారు.

కాంగ్రెస్‌లో లోపించిన ఐక్యత...

కాంగ్రెస్ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి పోరాడి ఓడాడని చెప్పవచ్చు. ఆయన గెలు పు అంచులదాక వచ్చారు. కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఫలితం లేకుండా పో యింది. ఐటీ, పరిశ్రమల, శాసనసభా వ్యవహారాల శాఖ మం త్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తప్ప ఎవరు కూడా గెలుపును తమ భుజాలపై వేసుకోలేదని చెప్పవచ్చు. శ్రీధర్ బాబు ఇలాకాలో మూడు రౌండ్లలో నరేందర్ రెడ్డికి లీడ్ రావడం ఇందుకు నిదర్శనం. నరేందర్ రెడ్డి తన స్వం త సైన్యంతో చివరి వరకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.