* వచ్చే నెలలో మోదీ వైట్‌హౌస్‌ను సందర్శించొచ్చన్న ట్రంప్
* ఫోన్ సంభాషణకు సంబంధించిన వివరాలు వెల్లడి
వాషింగ్టన్, జనవరి 28: ప్రధాని నరేంద్రమోదీ వచ్చే నెలలో అమెరికాలో పర్యటిం చనున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరిలో భారత ప్రధాని నరేంద్రమోదీ వైట్‌హౌస్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రధాని మోదీతో సోమవారం జరిగిన ఫోన్ సంభాషణ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ..
‘ సోమవారం ఉదయం మోదీతో సుదీర్ఘంగా మాట్లాడా. భారత్‌తో మనకు మంచి అనుబంధం ఉంది. బహుశా వచ్చే నెలలో ఆ దేశ ప్రధాని వైట్‌హౌస్‌కు రావొచ్చు’ అని తెలిపారు. ఇదిలా ఉంటే ఇండో మిడిల్ ఈస్ట్, యూరప్‌లో భద్రత సహా అనేక ప్రాంతీయ సమస్యలపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్టు వైట్‌హౌస్ ఓ ప్రకనటలో వెల్లడించింది.
అమెరికన్లకు ఆదాయపు పన్ను రద్దు!
అమెరికన్లకు ఆదాయపు పన్ను రద్దు చేసే లా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలు పంపుతున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసేలా ఉం డేందుకు ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే అమెరికన్ గవర్నమెంట్‌కు ఆదాయపు పన్ను ద్వారానే అధిక మొత్తంలో నిధులు సమకూరుతున్నాయి.
అయితే అధ్యక్షుడి నిర్ణయం అమలైతే ఆ లోటును పూడ్చుకునేందుకు వివిధ దేశాల మీద సుంకాలు వేయనున్నట్లు చెబుతున్నా రు. అమెరికన్లను సంపన్నులను చేసేలా చర్యలు తీసుకుంటానని ట్రంప్ చెబుతున్నారు. 1870 మధ్య అమెరికా వా సులు అత్యధిక సంపదతో విరాజిల్లారని మళ్లీ ఆరోజులు తీసుకొస్తానని ట్రంప్ పేర్కొన్నారు. ఆ రోజుల్లో సుంకాల ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉండేదని గుర్తు చేశారు.
ఏది కరెక్టో మోదీ అది చేస్తారు
వాషింగ్టన్, జనవరి 28: అమెరికా ప్రభుత్వం అక్రమవలసదారుల పై ఉక్కుపాదం మోపుతుంది. ఎక్కడికక్కడ అరెస్టు చేస్తూ వాళ్ల సొంత దేశా లకు చేరవేస్తుంది. ఈ క్రమంలో ట్రం ప్ భారత ప్రధాని నరేంద్రమోదీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశా రు. ఫ్లోరిడా నుంచి జాయింట్ బేస్ ఆం డ్రూస్‌కు తిరిగి వస్తూ ట్రంప్ విలేకరులతో మా ట్లాడారు. ఈ సందర్భంగా అక్రమ వలస దారుల అంశంపై ప్రధాని మోదీతో మాట్లాడా రా? అని మీడియా ప్రశ్నించగా.. దానికి ట్రంప్ బదులిస్తూ ఈ విషయంలో ప్రధాని మోదీ సరైనదే చేస్తారని పేర్కొన్నారు.
భారత్‌కు వాత తప్పదా?
ట్రంప్ కనుక అమెరికా వాసులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపునిస్తే భారత్ సహా ఇంకా అనేక దేశాలపై సుంకాలు అధికంగా పడే అవకాశం ఉంది. బ్రిక్స్ దేశాలు కనుక ప్రత్యేక కరెన్సీని తీసుకొచ్చి డాలర్ వినియోగాన్ని నిలిపేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని.. అటువంటి దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు.