- ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు
- కళాకారులతో కలిసి ఢోలు వాయించిన ప్రధాని
సింగపూర్, సెప్టెంబర్ 4: బ్రూనై పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్‌లో ఆయనకు నృత్యాలు, సంగీత ప్రదర్శ నలతో ప్రవాస భారతీయులు ఘన స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా ఓ మహిళ మోదీకి రాఖీ కట్టింది. అనంతరం బస చేసే హోటల్‌కు చేరుకున్న మోదీకి మహారాష్ట్ర కళాకారులు జానపద నృత్యం లావణిని మహిళలు ప్రదర్శించారు.
అదే సమయంలో కళాకారులతో కలిసి మోదీ ఢోలు వాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో మోదీ భేటీ అయ్యారు. భారత్, సింగపూర్ స్నేహాన్ని పెంపొందించే లక్ష్యంతో ఆ దేశ నాయకులతో ప్రధాని భేటీ కానున్నారు.