calender_icon.png 30 March, 2025 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీరామనవమి నాడు రామేశ్వరానికి మోదీ!

27-03-2025 12:20:28 AM

ఆలయంలో ప్రత్యేక పూజలు

వంతెన ప్రారంభోత్సవం

న్యూఢిల్లీ: శ్రీరామనవమి(ఏప్రిల్ 6న) రోజున ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని రామేశ్వరాన్ని సందర్శించనున్నారు. రామనాథస్వామి ఆలయంలో పూజలు చేయడంతో పాటు పంబన్ వంతెనను కూడా ప్రారంభిస్తారు. 2.10 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన దేశంలోని ప్రధాన భూభాగంలోని మండపాన్ని పంబన్ ద్వీపంలోని రామేశ్వరంతో కలుపుతుంది. తమిళనాడులో రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఈ వంతెనను అధునాతన సాంకేతికతతో నిర్మించారు. ఈ వంతెన మధ్యలో భారీ ఓడలు వచ్చినప్పుడు తెరుచుకునేలా ప్రత్యేక గేట్లు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. బ్రిటిష్ కాలం నాటి పాత పంబన్ వంతెన స్థానంలో ఈ కొత్త వంతెన అందుబాటులోకి రానుంది. ఈ వంతెనకు 2019లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.