calender_icon.png 5 February, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13న ట్రంప్‌తో మోదీ సమావేశం!

05-02-2025 12:53:34 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. పారిస్ వేదికగా జరిగే కృత్రిమ మేధ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఈ నెల 10వ తేదీన పారిస్ వెళ్లనున్నారు.

11వ తేదీ వరకూ అక్కడే ఉండి 12న అమెరికాకు బయల్దేరి వెళ్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రంప్ రెండోసారి అధికార బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికాను సందర్శిస్తున్న అతికొద్ది మంది ముఖ్య నేతల్లో మోదీ ఒకరు. కాగా ట్రంప్‌తో సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది.