విశాఖపట్నం,(విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధాని మోదికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదేల పవన్ కళ్యాణ్, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ ప్రజలకు మోదీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో కలిసి అభివాదం చేస్తు భారీ రోడ్ షో చేశారు. సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్(AU Engineering College) వరకు నిర్వహించిన రోడ్ షోలో మోదీకి అడుగడగునా పూలు జల్లుతూ ఘనస్వాగతం పలికారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభకు ప్రదాని మోదీ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు కోస్తాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రూ.2.08 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని అంచనా. అనకాపల్లిలో విశాఖ రైల్వేజోన్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, బల్క్ డ్రగ్ పార్క్ వంటి చిరకాల స్వప్నాన్ని మోదీ ప్రారంభించనున్నారు.