calender_icon.png 31 October, 2024 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డైమండ్ వ్యాపారి ఇంటికి మోదీ

31-10-2024 02:22:50 AM

నూతన వధూవరులకు ఆశీర్వదించిన ప్రధాని

గాంధీనగర్,అక్టోబర్ 30: తన సేవాగుణంతో పేరు తెచ్చుకున్న గుజరాత్‌కు చెందిన డైమండ్ వ్యాపారి ఇంట్లో శుభకార్యానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. సావ్జీ ఢోలాకియా కుమారుడు ద్రవ్య వివాహం జాన్వీతో ఈ వారంలో జరిగింది. ఈ వేడుకకు మోదీ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వీడియోను సావ్జీ షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.

ఈ సందర్భంగా ద్రవ్య, జాన్వీ వివాహబంధంతో ఒక్కటైన సందర్భంగా ప్రధాని మోదీ హాజరుకావడం గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నామని సావ్జీ పేర్కొన్నారు. సావ్జీ ముంబైలో హరికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ పేరుతో వజ్రాల వ్యాపారం చేస్తారు. తనకు వచ్చిన లాభాల్లో కొంతభాగాన్ని తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు పంచుతారు.