calender_icon.png 29 April, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెహుల్ ఛోక్సీ అరెస్టు ఘనత మోదీదే

15-04-2025 01:13:22 AM

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): దేశ ంలో బ్యాంకుల ను మోసం చేసి బెల్జియం పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్టు ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభా ష్ స్పష్టం చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుద ల చేశారు.

ప్రజల డబ్బును దోచుకుని పారిపోయినవారు ఎక్కడ దా క్కున్నా మోదీ సర్కార్ వదలబోదన్నారు. ముంబై పేలుళ్ల ఘటనకు కా రణమైన తహవూర్ రాణాను అమెరికా నుంచి ఇండియాకు రప్పిం చ డం కూడా మోదీ దౌత్యనీతికి నిదర్శనమన్నారు. ఆర్థిక నేర గాళ్లపై మోదీ సర్కారు తీసుకుంటు న్న చర్యలతో వారు వణికిపోతున్నారన్నారు.