calender_icon.png 13 January, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని జన్మదినాన..

17-09-2024 03:25:25 PM

న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వంద రోజుల పాలన పూర్తి  చేసిన సందర్భంగా మూడవ సారి సాధించిన విజయాలను పేర్కొంటూ హోం మంత్రి అమిత్ షా, రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఆధ్వర్యంలో  ప్రత్యేక బుక్ లెట్ ను విడుదల చేశారు. "లక్ పతీ దీదీ యోజనా" పథకం కింద 11 లక్షల మహిళలకు లబ్ది చేకూర్చినట్లు పేర్కొన్నారు. ఒక కోటి మహిళలు ఏటా  లక్ష రూపాయలు సంపాదిస్తూ  ఆత్మ గౌరవంగా  బతికే అవకాశం కలిపించామన్నారు. పేద కుటుంబంలో పుట్టిన మోడీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని కావడం స్ఫూర్తి దాయకం అన్నరు. 15 దేశాలు ఆయనను  అత్యున్నత గౌరవాన్నిచ్చి  సత్కరించాయన్నారు.నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన దీర్ఘాయువు 140 కోట్ల మంది భారతీయులు   ప్రార్థిస్తున్నారు అని అమిత్ షా న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో అన్నారు. 

పేదల అభివృద్ధి, భద్రత, సంక్షేమం కోసం  గత 10 ఏళ్ల పాలనను అంకితం చేశారన్నారు. గత 60 ఏళ్లలో మొదటిసారి   బిజెపి  కూటమి పార్టీలకు భారత ప్రజలు పట్టం కట్టారన్నారు.. దీంతో గత 10 ఏళ్లలో దేశంలో రాజకీయ సుస్థిరత వాతావరణం నెలకొందని తెలిపారు. అంతర్గత  భద్రతను బలోపేతం చేస్తూ  బలమైన భారతదేశాన్ని  స్థాపించడంలో మోడీ ప్రభుత్వం విజయవంతమైందన్నారు.  ప్రాంతీయ భాషలను గౌరవిస్తూ.. దేశ భాషలోనే బోధన చెయ్యలనేదే తమ ధ్యేయం అని తెలిపారు. అటు ప్రాచీన విద్యా విధానంలోని విలువలు  ఇటు  ఆధునిక విద్యలోని నైపుణ్యం మన విద్యార్థులకు అవసరమన్నారు.  ప్రధాని మోదీ ప్రవేశ పెట్టిన ఈ మేరకు నూతన విద్యా విధానానంతో భారత యువత ప్రపంచ వ్యాప్తంగా విజేతలుగా అని అమిత్ షా తెలిపారు.