15-04-2025 12:00:00 AM
ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): కంచగచ్చి భూము లపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాస్తవాలు తెలుసుకోకుం డానే తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఆ భూమి వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. ఏ1 మార్ఫింగ్ ఫోటోలను చూసి ప్రధాని మోదీ విమర్శలు చేసినట్లు ఉన్నారని తెలిపారు.
ఓబీసీ అ ని చెప్పుకునే మోదీ ఇప్పటీ వరకు కుల గణనపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. మాజీ మంత్రి జానారెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను ఖండించనని, అలా అని సమర్థించినట్టు కాదని ఎంపీ చామల సమాధానమిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి ఇన్ చార్జిగా ఉన్నది వాస్తవమేనన్నారు. ఎంపీగా తన విజయంలో పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ శ్రేణులు పని చేశారన్నారు.