calender_icon.png 5 March, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గవని మోదీ చెప్పారు!

05-03-2025 12:00:00 AM

మీడియా చిట్‌చాట్‌లో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): డిలిమిటేషన్‌పై ఇప్పుడంతా చర్చ జరుగుతుందని.. దక్షిణాదిలో ఒక్క లోక్‌సభ స్థానమైనా తగ్గదని ప్రధాని మోదీ తేల్చిచెప్పారని రాజ్యసభసభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్  స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

2011తో పోలిస్తే తెలంగాణ, ఏపీలో జనాభా తగ్గిందని, అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు తగ్గబోవని జోస్యం చెప్పారు. ఏపీ పునః వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెంచుకునే అవకాశం ఉందని వెల్లడించారు.

నల్లగొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థికి శ్రీపాల్‌రెడ్డికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతునిచ్చాయని, అందుకే ఆయన విజయం సాధించగలిగరన్నా రు. రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతున్నదని, దీంతో సీఎం రేవంత్‌రెడ్డికి భయం పట్టుకున్నదని వ్యాఖ్యానించా రు.

కేంద్రం త్వరలోనే జనగణన ప్రారంభిస్తుందని, ఏడాదిలో ప్రక్రియ పూర్తి చేస్తుందన్నారు. దక్షిణాది వ్యక్తికే పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కట్టబెడతారనే చర్చ ఎక్కడా జరగడం లేదని, రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన తర్వా తే జాతీయ అధ్యక్షుడి ఎంపిక ఉంటుందన్నారు. బీసీల్లో పది శాతం ముస్లిం లను కలుపకపోతే బీజేపీ కులగణనను ఆమోదిస్తుందని తేల్చిచెప్పారు.