06-04-2025 04:31:45 PM
పెన్ పహాడ్: భారతదేశంలో బీజేపీ రాకతో మోడీ హేట్రిక్ పాలనలో అవినీతి రహిత పాలన కొనసాగుతుందని బీజేపీ మండలాధ్యక్షుడు తాళ్లపల్లి మధు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలసి పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంతోనే దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు రాపర్తి వెంకన, తాడోజు జనార్ధనా చారి, మారోజు నాగేంద్ర చారి, గుడపురి శ్రీను, అరె ప్రభాకర్, చామకూరి వెంకటేష్ ఒగ్గు వినోద్, పవనగంటి సతీష్ చారి, చిన్నపంగి నాగరాజు, చిత్రం శ్రీకాంత్, కత్తి లక్ష్మయ్య, ఒగ్గు రాములు తదితరులు ఉన్నారు.