calender_icon.png 19 April, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ-మస్క్ ఫోన్ కాల్ సంభాషణ

19-04-2025 12:00:00 AM

ఎక్స్ వేదికగా ప్రకటించిన మోదీ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్‌లో సంభాషించారు. ఈ విషయాన్ని స్వయంగా మోదీనే ఎక్స్ వేదికగా తెలిపారు. ‘ఎలాన్ మస్క్‌తో వివిధ అంశాలపై ఫోన్ కాల్‌లో చర్చించా. ఈ ఏడాది మొదట్లో వాషింగ్టన్‌లో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను ప్రస్తావించాం.

సాంకేతికత, ఆవిష్కరణ తదితర రంగాల్లో రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం’ అని మోదీ పేర్కొన్నారు. కాగా మస్క్ కంపెనీలైన స్టార్ లింక్, టెస్లాలు భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు చూస్తున్న వేళ వీరి సంభాషణకు ప్రాధాన్యం సంతరించుకుంది.