calender_icon.png 2 November, 2024 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాదరణలో మోదీనే టాప్

04-08-2024 02:55:28 AM

సోషల్ మీడియాలో ప్రభ తగ్గని ప్రధాని

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ప్రధాని నరేంద్రమోదీకి భారత్‌లో ఎంతటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. చిన్నపిల్లవాడిని అడిగినా మోదీ ఎవరనేది చెప్పేస్తాడు. సోషల్‌మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండటం, తరుచూ విదేశీ పర్యటనలు చేయటంతో ఆయనకు విదేశాల్లోనూ బాగానే పాపులారిటీ ఉన్నది. తాజాగా ప్రపంచ దేశాధినేతల్లో మరోసారి మోదీయే టాప్‌లో నిలిచారు. అత్యంత ప్రజాదరణ ఉన్న దేశాధినేతల జాబితాను ఇటీవల మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ విడుదల చేసింది. ఇందులో మోదీ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ రెండో స్థానంలో, బ్రిటన్ కొత్త ప్రధాని కీర్ స్టార్మర్ రెండోస్థానంలో ఉన్నారు. జూలై 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సేకరించిన డాటా ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చినట్టు మార్నింగ్ కన్సల్ట్ సంస్థ తెలిపింది. మోదీకి 69 శాతం అప్రూవల్ రేటింగ్ వచ్చింది. మెక్రికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడార్ 63 శాతం అప్రూవల్ రేటింగ్ సాధించారు. జపాన్ ప్రధాని ఫుమిడో కిషిదాకు అత్యల్పంగా 16 శాతమే అప్రూవల్ రేటింగ్ లభించింది.