జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ ఆరోపణ
రాంచీ, నవంబర్ 15: ప్రధాని మోదీ దేశ ంలోని పేదల ప్రయోజనాలను ఫణంగా పెట్టి బిలియనీర్ల కోసం పని చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లా ఎన్నికల ర్యాలీలో శుక్రవారం మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షి ంచడానికి ఇండియా కూటమి పోరాటం చేస్తోంటే బీజేపీ మాత్రం దాన్ని చెత్తబుట్టలో పడేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. తాను రెడ్‌బుక్ పట్టుకున్నానని ప్రధాని అంటున్నారని అయితే ఇక్కడ బుక్ రంగు ముఖ్యం కాదని, అందులోని సమాచారమే కీలకమన్నారు.
ద్వేషాన్ని ప్రేరే పించి సమాజాన్ని విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాను మోదీకి లేదా 56 ఇంచుల చాతికి భయపడబోనన్నారు. కొద్దిమంది బిలియనీర్ల చేతిలో మోదీ కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. రాత్రిపూట వ్యాపారవేత్తల పెళ్లివేడు కలను హాజరై ఎంజాయ్ చేస్తూ పగటి పూట ప్రజలకు ఉపన్యాసాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు.
రాహుల్ చాపర్‌కు అనుమతి లేక..
జార్ఖండ్ పర్యటనలోనే ఉన్న కాం గ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హెలికాప్టర్ సైతం గంటపాటు నిలిచిపో యింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) నుంచి అనుమతి రాకపోవటం వల్లనే గోడ్డాలోనే ఆగిపోవడంతో రా హుల్ షెడ్యూల్‌కు ఆటంకం ఏర్పడిం ది. ఈ సమస్యకు బీజేపీ కుట్రే కారణమని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.