30-03-2025 05:00:23 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మన్ కీ బాత్ వల్ల భారత ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ మరింత చేరువ అయ్యారని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చిలుమున శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆదివారం నెన్నల మండల అధ్యక్షులు అంగలి శేఖర్, 210 బూత్ అధ్యక్షులు లింగంపల్లి మహేష్ ఆధ్వర్యంలో ఘనపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రధాని మోదీ 2014లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అప్పటినుండి ప్రతి నెల చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేస్తున్నారని తెలిపారు. భారత దేశ ప్రజల విజయాలను ఈ కార్యక్రమంలో పంచుకుంటారని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఇప్ప పువ్వు లడ్డు గురించి మోదీ ప్రశంసించారని తెలిపారు. సామాన్య ప్రజల భావాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంతోష్, గడ్డం వంశీ, స్వామి, శంకర్, రాజేష్, పవన్, మహేష్, బానేష్, హనుమంతు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.