అందులో ఏముందో అయనకు తెలియదు
అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు
రాహుల్‌గాంధీ విమర్శలు
న్యూఢిల్లీ, నవంబర్ 26: రాజ్యాంగంలో ఏముందో తెలియకుండానే ప్రధాని నరేంద్రమోదీ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహి స్తున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో మంగళవారం ఏర్పాటు చేసిన సంవిధాన్ రక్షక్ అభియాన్‌లో మాట్లాడిన ఆయన రాజ్యాంగాన్ని చూపిస్తూ “ఇది భారత రాజ్యాంగం. దీన్ని మోదీ చదవలేదు. దానికి నేను గ్యారెంటీ. ఒక వేళ చదవి ఉంటే దినచర్యలో భాగంగా చేసే తప్పులను చేసేవారు కాదు” అని అన్నారు.
రాజ్యాంగంలో సావర్కర్ మాటలు ఉన్నా యా? హింసను ప్రేరేపించాలని ఎక్కడైనా రాసుందా? అని ప్రశ్నించారు. ఇది సత్యం, అహింసకు సంబంధించిన పుస్తకమని రాహుల్ పేర్కొన్నారు. ఇందులో అంబేడ్కర్, జ్యోతిరావ్ ఫూలే, బుద్ధుడు, గాంధీ ఆలోచనలు పొందుపరిచి ఉన్నాయని తెలిపారు.
బ్యాలెట్ పేపర్లే కావాలి: ఖర్గే
ఎన్నికల్లో ఈవీఎంలను కాకుండా బ్యాలె ట్ పేపర్లనే తాము కోరుకుంటున్నామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బ్యాలెట్ పేపర్‌ను తిరిగి తీసుకురావడానికి భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. తాము కచ్చితంగా విజయం సాధిస్తా మనుకున్న హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే ఈవీఎంలలో ఎలాం టి లోపాలు లేవని, పేపర్ బ్యాలెట్ విధానాన్ని కొనసాగించాలని సుప్రీంకోర్టు తెలిపిన రోజే రోజే ఖర్గే తాము బ్యాలెట్‌వైపే ఉన్నట్లు చెప్పా రు. ఈవీఎంలను పక్కన పెట్టాలంటే అందరం ఒక్కతాటిపైకి రావాలని, ఈవీఎంల కారణంగా పేదల ఓట్లు వృథా అవుతున్నాయన్నారు.