- కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం
- పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాం తి) : తాను ఓబీసీని అని చెప్పుకునే ప్రధాని మోదీ ఆ వర్గాలకు చేసిందేమీ లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసి ప్రజల బాధలు తెలుసుకున్నారన్నారు. అందుకే కులగణన చేసి జనాభా నిష్పత్తి ప్రకారం సంపద పంచా లని నిర్ణయం తీసుకున్నారన్నారు.
సోమవారం గాంధీభవన్‌లో ఎమ్మెల్యే దానం నా గేందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇందిరాగాంధీ భూ సంస్కరణలు అమలు చేసి చరిత్రలో నిలిచి పోయారన్నారు. కుల గణనపై రాహుల్‌గాంధీ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. పార్టీ శ్రేణులు కులగణన చేసే అధికారులకు సహకరించాలని కోరారు. సో నియాగాంధీ వల్లే ఐఐఎం, ఐఐటీ వంటి విద్యాసంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు.
రిజర్వేషన్లపై ఉన్న సీలింగ్ ఎత్తేసేందుకు అన్ని రాజకీయ పార్టీ లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే నాగేందర్ మాట్లాడు తూ రాష్ట్రానికి వస్తున్న రాహుల్ గాంధీకి ఘనంగా స్వాగతం పలుకుతామన్నారు. అఖిల భారత సర్వీసుల్లోనూ వెనకబ డిన వర్గాలకు అన్యాయం జరుగుతోందని రాహల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేసినట్టు చెప్పారు.