calender_icon.png 31 October, 2024 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీది మోసాల చరిత్ర

04-07-2024 02:03:41 AM

బీజేపీది కూడా అదే తీరు

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అగ్రహం

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): రాహుల్‌గాంధీ కుటుంబానికి త్యాగాల చరి త్ర ఉంటే.. బీజేపీ, ప్రధాని మోదీకి మోసాల చరిత్ర ఉందని ఓటీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రాహు ల్‌గాంధీ వయసుపై మోదీ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు, నితీష్‌కుమార్ దయతో మోదీ మూడోసారి ప్రధాని అయ్యారని పేర్కొన్నారు. మోదీకి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినా అనందం లేదన్నారు. లోక్‌సభలో రాహుల్‌గాంధీ అడిగిన ప్రశ్నలకు ప్రధాని మైండ్ బ్లాక్ అయిందని, రాహుల్‌గాంధీ యువరాజేనని, ఆయన భారత్ జోడో యా త్ర, న్యాయ యాత్ర పేరుతో  దేశమంతా 8 వేల కిలోమీటర్లు  పర్యటించి ప్రజల నుంచి  సమస్యలు తెలుసుకుని అవగాహనకు వచ్చారని తెలిపారు.

మోదీ మాత్రం ప్రజలను కలవలేదని, అదే రాహుల్‌కు, మోదీకి మధ్య ఉన్న వ్యత్యాసమని దుయ్యబట్టారు. యూపీఏ హయాంలో ప్రధానిగా ఉండమన్నా రాహుల్ వద్దన్నారని అది ఆయన గుణం అని, కానీ మోదీ మాత్రం అద్వానీని అడ్డుకుని ప్రధాని అయ్యారని విమర్శించారు. నల్లధనం తెస్తాం.. ధరలు తగ్గిస్తాం, పేదల బ్యాంక్ ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామన్న వారు మాట నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. యూపీఏ హయాంలో రూ. 28 వేలకు తులం బంగారం ఉంటే ఇప్పుడు రూ. 72 వేలకు పైగా చేరిందని, జీఎస్టీతో జనం పరేషాన్‌లో ఉన్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.