20-04-2025 12:19:21 AM
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): గాంధీ కుటుంబంపై మోదీ ప్రభుత్వం విషం చిమ్ముతోందని యూ త్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీలపై ఈడీ కేసులకు నిరసనగా శనివారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈడీ ఆఫీసును ముట్టడించారు. అనంతరం ప్రధా ని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
శివచరణ్‌రెడ్డి మాట్లా డుతూ.. సోనియా, రాహుల్‌గాంధీపై కేసులు అప్రజాస్వామికమని, మోదీ అధికార అహంకారంతో ప్రభు త్వ సంస్థలను నాశనం చేస్తున్నారని ధ్వజమె త్తారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థలను మోదీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.