calender_icon.png 5 February, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం

05-02-2025 05:47:32 PM

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్...

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): కార్పొరేట్లకు మోడీ సర్కార్ ఊడిగం చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ఆరోపించారు. బుధవారం కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను గురించి నాలుగు కోడలుగా తయారు చేశారని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు నల్ల చట్టాలను రద్దుచేసి అన్నదాతలకు న్యాయం చేయాలని కోరారు. ఇటీవల కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సవరించి కార్మిక వర్గానికి, రాష్ట్రానికి నిధులు కేటాయించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టి.దివాకర్, ఉపాధ్యక్షుడు సుధాకర్, నాయకులు శ్రీనివాస్, మల్లేశం, ప్రవీణ్, మోహన్, తుకారాం, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.