calender_icon.png 10 January, 2025 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణపై మోదీ సర్కార్ వివక్ష

12-10-2024 02:33:27 AM

గోదావరి పుష్కరాలకు ఏపీకి రూ.100 కోట్లు 

తెలంగాణకు మాత్రం గుండు సున్నా : హరీశ్‌రావు 

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణపై మోదీ సర్కార్ వివక్ష చూపెడుతుందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ గోదావరి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.100 కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు గుండుసున్న ఇచ్చిందన్నారు.

రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్న వారితో రూపాయి ప్రయోజనం లేదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ సున్నా కేటాయింపులు చేసి, ఏపీకి మాత్రం అడిషనల్ గ్రాంట్ కింద రూ.15 వేల కోట్లు కేటాయించారని పేర్కొన్నారు.