calender_icon.png 25 September, 2024 | 4:00 PM

మోదీ మాకు సవాల్ విసిరారు

24-09-2024 12:00:00 AM

న్యూయార్క్ రౌండ్ టేబుల్ భేటీలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికా  పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ) దిగ్గజ టెక్ కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా మోదీ మాట్లాడుతూ.. ‘గతేడాది వాషింగ్టన్ వచ్చినప్పుడు మీలో కొందరితో సమావేశమయ్యే అవకాశం లభించింది. మరోసారి ప్రపంచంలో ప్రముఖ ఆవిష్కర్తలతో కూర్చోవడం గర్వంగా ఉంది. భారత్‌పై మీకున్న ఉత్సాహం, నమ్మకం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. మీరు ఇచ్చిన సూచనలు ఎంతో విలువైనవి‘ అని అన్నారు.

అనంతరం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. ‘భారత్‌ను మార్చడంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ఇది డిజిటల్ ఇండియా విజన్, భారత్‌లోనే తయారీ, డిజైనింగ్ ఉండాలని ఆయన మమ్మల్ని అడిగారు. ఇప్పు డు మా పిక్సెల్ ఫోన్లను భారత్‌లో తయారుచేయడం. గర్వంగా ఉంది. ఏఐతో భారత ప్రజలకు లభించే ప్రయోజనాల గురించి మోదీ ఆలోచిస్తున్నారు. ఈ సరికొత్త సాంకేతిక తను విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో ఉపయోగించేలా ఆలోచించేలా ఆయన మాకు సవా లు విసిరారు.

భారత్‌లో ఏఐ మరిం త విస్తరించేలా మేం ముందుకువెళ్తున్నాం. మోదీ స్పష్టమైన విజన్‌తో ఆలోచనలు చేస్తున్నారు‘ అని పిచా య్ అన్నారు.గూగుల్ సీఈవో సుం దర్ పిచాయ్, అడోబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంతను నారాయణ్, ఎన్విడియా సీఈవో జెన్సెన్ హాంగ్ సహా 15 కంపెనీల సీఈవోలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటో ను ప్రధాని మోదీ తన ’ఎక్స్’ ఖాతా లో పంచుకున్నారు.