బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి
కామారెడ్డి (విజయక్రాంతి): ప్రధాని మోదీ దేశంలో 10 కోట్ల సభ్యత్వాలు బిజెపి పార్టీ చేపట్టాలని ఒక సంకల్పంతో ముందుకు వచ్చారని బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి అన్నారు. సెప్టెంబర్ 2న చేపట్టిన భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం లింగంపేట్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ నాయకులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో లింగంపేట్ మండల కేంద్ర బీజేపీ నాయకులతో కలిసి బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆన్లైన్ సభ్యత్వ కార్యక్రమాన్నిప్రారంభించారు. లింగంపేట్ లో ఆన్లైన్ సభ్యత్వంలో సభ్యత్వం తీసుకున్న వారిని అభినందించారు లింగంపేట్ కేంద్రంతో పాటు మండలంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సభ్యత్వాలు ఎక్కువ శాతం నమోదు చేయుటకు మండల నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ సీనియర్ నాయకులు, డాక్టర్ పైడి ఎల్లారెడ్డితో పాటు బిజెపి యువ నాయకులు బొల్లారపు క్రాంతి, మంగలి పోచయ్య, మండల బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.