31-03-2025 12:58:51 AM
మన్ కీ బాత్‌లో ఉట్నూరు ఆదివాసీ మహిళలపై ప్రశంసలు
ఆరోగ్యానికి మేలు చేసే ఇప్పపువ్వు వంటకాల ప్రస్తావన
ఆదిలాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్రమోదీ నోట ఆది లాబాద్ జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ఆదివాసీ మహిళల మాటలు వినిపించడంతో జిల్లా ప్రజల్లో హరం వ్యక్తమవుతోంది. ప్రతి నెలా జరిగే మన్ కీ బాత్‌లో ఉట్నూరు ఏజె న్సీ ప్రాంతంలో ఇప్పపువు సేకరిస్తూ ఉపాధి పొందుతున్న ఆదివాసీ మహిళలు రేణుక, ఆత్రం చిన్నూబాయి గురిం చి మోదీ ప్రస్తావించారు.
అడవులనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆదివాసీలకు అడవిలో లభించే ప్రకృతి సంపదే ఉపాధి కల్పిస్తోంది. వేసవిలో మాత్రమే అడవుల్లో లభించే ఇప్పపువును ఆదివాసీ మహిళలు సేకరించి, వాటి దారా తినుబండారాలను తయారు చేస్తూ వాటిని విక్రయించడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఉట్నూరు ఐటీడీఏ దారా భీంబాయి ఆదివాసీ మహిళా సహకార సంఘం సభ్యులు ఆదివాసి ఆహారం పేరిట కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు.
మహిళలు సేకరించిన ఇప్పపువును లడ్డూలు, గారెలు, కుడుములు, అంబలి వంటివి తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. ఈ ఇప్పపువులో ప్రోటీ న్లు, విటమిన్ల లాంటి పోషకాలు సంవృద్ధిగా ఉన్నాయి. ఇప్పప్పువు వంటకాలను విక్రయిస్తూ ఎంతో లాభాన్ని, లాభానికి మించిన పేరుని సంపాదిస్తున్నారని మన్ కీ బాత్‌లో ప్రధాని ప్రశంసించారు. ఇప్పప్పువు వంటకాల తయారీలో ఆదివాసీ సం స్కృతి కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. ఇలాంటి గిరిజన మహిళలు మన సమాజానికి ఎంతో ప్రేరణ కల్పిస్తారని పేర్కొన్నారు.