calender_icon.png 31 October, 2024 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాహసోపేత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ మోదీ

11-08-2024 02:04:23 PM

దేశభక్తి విషయంలో రాజీపడని ధీరత్వం ప్రధాని సొంతం

370 ఆర్టికల్ రద్దు ఇందుకు నిదర్శనం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 

కరీంనగర్: సాహసోపేత నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశభక్తి విషయంలో రాజీలేని ధీరత్వం మోదీ సొంతమన్నారు. 370 ఆర్టికల్ రద్దుతో జమ్మూకాశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని చాటి చెప్పడమే కాకుండా ‘ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ చలేగా అని నిరూపించిన ధీరోధాత్తుడు నరేంద్రమోదీ అని కొనియాడారు.

కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్ని పథ్’ స్కీం ఎంతో మంచిదని, దీనిపై ప్రతిపక్షాలు లేనిపోని రాద్దాంతం చేసి విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూశాయన్నారు. ఈ స్కీంలో ఏమైనా ఇబ్బంది ఉంటే ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్దంగా ఉందే తప్ప విపక్షాల వలలో పడి విద్యార్థులు మోసపోవద్దని కోరారు.  కరీంనగర్ లోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్ లో నిర్వహించిన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ‘ఫ్రెషర్స్ డే’ కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై పై విఫంగ స్పందించారు.