13-02-2025 12:00:00 AM
కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్తలు
పెన్‌పహాడ్, ఫిబ్రవరి 12 : రైతులు వ్యవసాయంలో ఆధు నిక పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు, లాభాలు సాధిం చవచ్చన్నారు. బుధవారం మండలంలోని సింగారెడ్డి పాలెంలో ఐసిఎఆర్ భారతీయ వరి పరిశోధన సంస్థ ఆధ్వ ర్యంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎస్‌ఆర్ ఫండ్ సహకారంతో కేవికే గడ్డిపల్లి శాస్త్రవేత్తలు వరిలో డ్రం సీడర్, వెదజల్లే పద్ధతులు, వరిలో డ్రోన్ ద్వారా కలుపు మందు పిచికారిపై శిక్షణ కల్పించారు.
ఈ సందర్బంగా రైతులకు నేటి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఖర్చును తగ్గించుకుంటూ అధిక దిగుబడి పొందే విధానాలపై రైతుల దృష్టి సాధించాలని, అంతేకాకుండా నేరుగా వరి విత్తే విధానం ఒక సమర్థవంతమైన పరిష్కారంగా మారుతోంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవికే గడ్డిపల్లి శాస్త్రవేత్తలు డి నరేష్, డి.ఆదర్శ్, ఎ.నరేష్ , వ్యవసాయ విద్యార్థులు, రైతులు మాధవరామ్, సోమయ్య, రాములు, సైదులు తదిరులు పాల్గొన్నారు.