calender_icon.png 21 April, 2025 | 1:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగులో ఆధునిక పరిజ్ఞానాన్ని వాడాలి

13-12-2024 12:49:59 AM

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జీ చిన్నారెడ్డి 

రాజేంద్రనగర్, డిసెంబర్ 12: వాతావరణ మార్పుల కు అనుగుణం గా పంటలకు సోకే చీడపీడలను నివారించేందుకు ఆధునిక పరిజ్ఞాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జీ చిన్నారెడ్డి పేర్కొన్నారు. ‘రీసెంట్ అడ్వాన్స్‌స్డ్ ఇన్ ప్లాంట్ పాథాలజీ అండ్ ఇన్నోవేటివ్ అప్రోచెస్ ఇన్ ప్లాంట్ డిసీజ్ మేనేజ్‌మెంట్’ (రాపిడ్) అంశంపై రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సును గురువారం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విద్యాలయం ఆడిటోరియంలో ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి డాక్టర్ చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడు తూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధా, మిషన్ లర్నింగ్ తదితర టెక్నాలజీని శాస్త్రవేత్తలు సస్యరక్ష ణలో విరివిగా ఉపయోగించుకోవాలన్నారు. ఆహార, పోషణ, భద్రత కల్పిం చడంలోనూ శాస్త్రవేత్తలు తమ వంతు కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో తాడేపల్లిగూడలెంలోని డాక్టర్ వైఎస్సార్ హర్టీకల్చర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ గోపాల్,  కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విద్యాలయం వీసీ డాక్టర్ రాజిరెడ్డి, గుంటూ రులోని ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్ శారదా జయలక్ష్మిప్రసంగించారు. అంతకు ముందు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ సత్యనారాయణ ప్రసంగించారు.