03-03-2025 10:56:51 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...
మందమర్రి (విజయక్రాంతి): ఆధునిక సాంకేతిక విద్యా ప్రమాణాలను మరింత పెంపొందించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా అభ్యర్థులకు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో చేపడుతున్న అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రం నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఆధునిక సాంకేతిక విద్యా ప్రమాణాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నేటి పోటీ ప్రపంచంలోని సాంకేతికను అభ్యర్థులకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా ఆధునిక రంగాలలో అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా వివిధ అత్యాధునిక సాంకేతికత కోర్సులను అందించడం జరుగుతుందని, వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ అందించి ఉపాధి పొందేలా అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ సతీష్ కుమార్, ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ దేవానంద్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.