న్యూఢిల్లీ: ఈకెస్ట్రియాన్‌లో భారత సీనియర్ రైడర్ శృతి వోరా నయా చరిత్ర లిఖించింది. త్రీస్టార్ గ్రాండ్‌ప్రి నెగ్గిన తొలి భారత రైడర్‌గా రికార్డుల్లోకెక్కింది. స్లొవేనియా వేదికగా జరిగిన సీడీఐ 3 ఈవెంట్‌లో శృతి 67.761 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచినట్లు.. భారత ఈక్వెస్ట్రియాన్ సమాఖ్య గురువారం వెల్లడించింది. టైటానా ఆంటోనెనో (66.522; మాల్దోవా), జూలియన్ జెరిచ్ (66.087; ఆస్ట్రేలియా) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కిం చుకున్నారు. ‘ఈ ప్రదర్శనతో ఆనందంగా ఉన్నా. కఠోర శ్రమకు దక్కిన ఫలితమిది. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు ఇలాంటి ప్రదర్శన నమోదు చేయడం నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. త్రి స్టార్ గ్రాండ్‌ప్రిలో పతకం నెగ్గిన తొలి భారత రైడర్ అని తెలిసినప్పుడు ఉద్వేగానికి గురయ్యా. ఇదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నా’ అని విజయం అనంతరం శృతిపేర్కొంది.