యూఎఫ్‌సీ బౌట్ గెలిచిన తొలి భారత మహిళగా రికార్డు
కెంటకీ: మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్‌లో భారత ఫైటర్ పూజా తోమర్ సంచలనం సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్ (యూఎఫ్‌సీ)లో బౌట్ నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఫైటర్‌గా రికార్డుల్లోకెక్కింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఫైట్ ద్వారానా యూఎఫ్‌సీలో అరంగేట్రం చేసిన పూజ 30 27 29 ర్యాన్నె డోస్ (బ్రెజిల్)పై విజయ ంసాధించింది. మహిళల 52 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల పూజ.. తొలి బౌట్‌లోనే అదరగొట్టింది.
చిన్నప్పుడు కరాటే, మార్షల్ ఆర్ట్స్‌లో తర్ఫీదు తీసుకున్న పూజ నిరుడు యూఎఫ్‌సీ కాంట్రాక్ట్ అందుకుంది. గతంలో ఇద్దరు భారతీయులు ఈ కాంట్రాక్టు అందుకున్నా.. విజయాలు మాత్రం సాధించలేకపోయారు. కానీ పూజ మాత్రం తన నైపుణ్యంతో సత్తాచాటింది. తొలి రౌండ్‌లో గెలిచిన పూజ.. రెండో రౌండ్‌లో కాస్త వెనుకబడ్డా.. నిర్ణయాత్మక రౌండ్‌లో తిరిగి పుంజుకొని ప్రత్యర్థిని చిత్తుచేసింది.