calender_icon.png 20 March, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాధారణ ప్రసవాల కోసం ఆధునిక పరికరాలు

20-03-2025 01:08:46 AM

నాగర్ కర్నూల్ మార్చి 19 (విజయక్రాంతి)నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాల్లో జరిపించేందుకు వీలుగా అత్యధికమైన హైడ్రాలిక్ టేబుల్స్ పరికరాలు అందుబాటులోకి వచ్చినట్లు జనరల్ ఆస్పత్రి సూపర్డెంట్ రఘు పేర్కొన్నారు.

బుధవారం అందుబాటులోకి వచ్చిన పరికరాలను ప్రారంభిస్తూ మాట్లాడారు. ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం పొందాలని, అందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో వస్తున్న గర్భిణీలు సాధారణ ప్రసవాలు చేయుట దృష్ట్యా కలెక్టర్ బడావత్ సంతోష్, స్థానిక ఎమ్మెల్యే కుచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహతో చర్చించి ప్రత్యేకంగా నాగర్ కర్నూలు ఆసుపత్రికి అధునాతన పరికరాలను తెప్పించినట్లు తెలిపారు.

ట్యూబెక్టమీ, వేసక్టమీ ఆపరేషన్లు కూడా అందుబాటులోకి వచ్చాయని త్వరలో  మహిళలు పురుషులు కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రవిశంకర్ నాయక్, డాక్టర్ అజీమ్, స్త్రీ వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ నీలిమా, డాక్టర్ సుప్రియ, డాక్టర్ శ్రావణి, డాక్టర్ కవిత, డాక్టర్ సౌమ్య, డాక్టర్ నందిని, డాక్టర్ మనీషా, డాక్టర్ మని, నర్సింగ్ ఆఫీసర్లు పుష్పలత, కవిత, రేవతి ఉమా , పార్వతి, ప్రసన్న, సువేధ, చంద్రకళ, కమల, ఆనంద్, హెల్ప్ డెస్క్ ఇంచార్జ్ గిరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.