హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో మూడు రోజలపాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ఈ క్రమంలో సాయంత్రం లేదా రాత్రి పూట చిరు జిల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. భారీ వర్ష సూచన లేనందున ఐఎండీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.