calender_icon.png 1 November, 2024 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో మోస్తరు వర్షం

03-07-2024 12:03:05 AM

హైదరాబాద్ సిటీబ్యూరో,జూలై2(విజయ క్రాంతి): హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రెస్క్యూ బృందాలు రహదారులపై నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టాయి. బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, మెహిదీపట్నం, షేక్‌పేట, మాదాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, అత్తాపూర్, రాజేంద్రనగర్, మలక్‌పేట, అబిడ్స్, నారాయణగూడ, బాగ్‌లింగంపల్లి, ముషీరాబాద్ ప్రాంతాల్లో 2 గంటలకు పైగా ఎడతెరిపి లేని వర్షం కురిసింది. రాత్రి 10 గంటల వరకు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకా రం.. హిమాయత్‌నగర్‌లో అత్యధికంగా 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.