హీరో విశ్వక్‌సేన్ ‘లైలా’ చిత్రంలో అబ్బాయి, అమ్మాయి గా యూనిక్ క్యారెక్టర్లు పోషించనున్నాడు. దర్శకుడు రామ్‌నారాయణ్ తెరకెక్కిస్తున్నారు. సాహు గారపాటి నిర్మిస్తున్నారు. విశ్వక్‌సేన్ పాత్రను ‘సోను మోడల్’గా పరిచయం చేస్తూ మేకర్స్ బుధవారం ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఆయన ఇందులో స్టులిష్‌గా, రిచ్ అవతార్‌లో కనిపించారు. ఆకాంక్ష శర్మ కథానాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రం 2025, ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున విడుదల కానుంది.