హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): మార్చి నెలలో జరగ బోయే నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోడ ల్ స్కూల్ టీచర్లు ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్‌కు మద్దతు ప్రకటించినట్టు ఆ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షు డు భూతం యాకమల్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా పూల రవీందర్ మాట్లాడుతూ.. మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనను కలిసి మద్దతు తెలిపినవారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేశ్, సహాధ్యక్షుడు ధనుంజయ్, రవీందర్‌గౌడ్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.