calender_icon.png 26 April, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

27న మాడల్ స్కూల్స్ ఎంట్రెన్స్ టెస్ట్

26-04-2025 01:18:04 AM

హాజరుకానున్న 40వేల మంది విద్యార్థులు

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): 2025 విద్యాసంవ త్సరా నికి తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం ఈ నెల 27న ప్రవేశ పరీక్ష జరగనుంది. 6వ తరగతి ప్రవేశాల కో సం ఉదయం 10 గంటల నుంచి మ ధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతి ప్రవేశాల కోసం మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంట ల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో మొత్తం 19,400 వరకు సీట్లున్నాయి. ఇందుకు మొత్తం 40 వేల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆరో తరగతికి 23,945 దరఖాస్తులు, ఏడో తరగతికి 6793, ఎనిమిదో తరగతికి 5249, తొమ్మిదో తరగతికి 3436, పదో తరగతికి 909 దరఖాస్తులు వచ్చాయి.