విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి ఎంఎస్టీఏ విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించే విధం గా చర్యలు తీసుకోవాలని మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షులు భూతం యాకమల్లు, సహా అధ్యక్షులు సిలువేరు స్వామి కోరారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంను కలిసి విజ్ఞప్తి చేసినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
దీనిపై బుర్రా వెంకటేశం స్పంది స్తూ ట్రెజరీ (010) ద్వారా వేతనాలు ఇవ్వాలని కోరుతూ ఆర్థిక శాఖకు ఫైల్ పంపడం జరిగిందని చెప్పినట్లు పేర్కొన్నారు. కారుణ్య నియామకాలు, ఫ్యామిలీ పెన్షన్, ఈఎల్స్ సరెండర్ తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.