calender_icon.png 18 January, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ స్కూల్ టీచర్స్ క్యాలెండర్ ఆవిష్కరణ

18-01-2025 01:08:22 AM

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్‌టీఏ) నూతన సంవత్సర క్యాలెండర్‌ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఆవిష్కరిం చారు.

ఈ సందర్భంగా మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు ఇవ్వాలని, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, నోషనల్ సర్వీస్ కల్పించాలని, పదోన్నతులు ఇచ్చి నూతన నియామకాలు జరిగేలా చూడాలని మంత్రిని వారు కోరారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని ఈమేరకు మంత్రికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, సహాఅధ్యక్షులు ధనుంజయ్, యాదగిరి, రవీందర్, రమేశ్ తదితరులు వినతి పత్రం అందించారు.